తొమ్మిది రంగాల్లో ప్రపంచ లక్ష్యాలు సాధించాలి

– సునీల్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పంచాయతీరాజ్‌ సంస్థలు తొమ్మిది రంగాల్లో ప్రపంచ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయితీ రాజ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ -అవలోకనం, అవకాశాలు అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయితీ రాజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌. జి.నరేంద్ర కుమార్‌, అదనపు కార్యదర్శి డాక్టర్‌ చంద్ర శేఖర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.