క్రమశిక్షణారాహిత్యాన్ని సహించం

– శిక్షణ పొందబోయే కానిస్టేబుళ్లకు డీజీపీ హెచ్చరిక
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
శిక్షణా సమయంలో కొత్త కానిస్టేబుళ్లు క్రమ శిక్షణారాహిత్యం, దుష్ప్రవర్తనకు పాల్పడితే ఏ మాత్రమూ సహించబోమని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. శిక్షణా సమయంలో వీరు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడకుండా నిఘా వేసి ఉంచాలని పోలీసు ట్రైనింగ్‌ కాలేజీ(పీటీసీ)ల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు. మంగళవారం రాష్ట్రంలోని 29 పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు, వైస్‌ ప్రిన్సిపాళ్లకు కొత్త కానిస్టేబుళ్లకు ఇవ్వబోయే శిక్షణకు సంబంధించి ఒక్కరోజు వర్క్‌షాప్‌ను డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు.