నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరమని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం దేశంలోని ప్రతి రాజకీయపార్టీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ప్రజా సేవలో ఉన్నారనీ, వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.