నిధుల సమీకరణలో ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌

హైదరాబాద్‌ : ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ సంస్థ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ) చేయడం జారీ ద్వారా రూ.400 కోట్ల వరకు సమీకరించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రూ.100 కోట్ల తొలి విడత జారీ చేసి.. మరో రూ.300 కోట్ల గ్రీన్‌ షూ అప్షన్‌తో కలిపి మొత్తంగా రూ.400 కోట్లు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. రూ.1,000 ముఖ విలువ ఉండే ఎన్‌సీడీలు సెప్టెంబర్‌ 14 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 24 నెలల నుంచి 96 నెలల వరకు కాలావ్యవధి ఉండే వీటిపై రాబడి రేటు 8.65 శాతం నుంచి 9.43 శాతం దాకా ఉంటుందని వెల్లడించింది.