అన్ని తానై..

నవతెలంగాణ – రేవల్లి: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అను వాక్యాన్ని నిజం చేస్తూ తను పుట్టిన ఊరి కోసం, తన వారి కోసం, తన చుట్టుపక్కల ఉన్నటువంటి జనం కోసం, అన్నీ తానై పాటుపడుతున్నటువంటి వ్యక్తి శానాయిపల్లి సర్పంచ్ శ్రీమతి లక్ష్మీ. గత ఐదు సంవత్సరాల కాలంలో తన ఊరికి కావలసినటువంటి ఎన్నో కార్యక్రమాలను సర్పంచ్ అనే బాధ్యతతో ప్రభుత్వపరంగా చేపడుతూ, అదేవిధంగా తన సొంత ఊరు సొంతవాళ్లు అనే భావనతో ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు శ్రీమతి లక్ష్మీ. సీసీ రోడ్లు అయితేనేమి, కరెంటు విషయంలో అయితేనేమి, పెన్షన్స్ అయితే నేమి, తాగునీటి విషయం అయితేనేమి, ఇండ్ల విషయం అయితేనేమి, వితంతు పింఛను అయితే నేమి, ఈ విధంగా చెబుతూ పోతే ఎన్నో కార్యక్రమాలు తనని అడిగిందే తడవుగా ఎవరు అడిగితే వాళ్ళకి వీరు నా వాళ్ళు, వీరు పరాయి వాళ్ళు అని భేదాభిప్రాయం చూడకుండా అందరికీ సహకరిస్తూ ముందుకు సాగిపోతున్నారు. శ్రీమతి లక్ష్మి  శానాయపల్లి సర్పంచ్ ఇకమీదట కూడా శానాయిపల్లి గ్రామానికి ఇదేవిధంగా సేవలందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.