నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు నర్సింగ్ స్కూళ్లలో 2023 – 2024 విద్యా సంవత్సరానికిగానూ జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రైనింగ్ మూడేండ్ల కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 16 వరకు అందుబాటులలో ఉంటుందని అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ స్కూళ్లలో సెప్టెంబర్ 19లోగా, ప్రయివేటు స్కూళ్లలో అక్టోబర్ 10లోగా సమర్పించాలని పేర్కొంది. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 4 నాటికి పూర్తవుతుందని 2023-2024 విద్యా సంవత్సరానికి తరగతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవు తాయని తెలిపింది. మరిన్ని వివరాల కోసం మెడికల్ ఎడ్యుకే షన్ డైరెక్టర్ అధికారిక వెబ్‌సైట్ ష్ట్ర్‌్‌జూ://సఎవ. ్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅని సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు.