ఇంటర్‌ ఉద్యోగులకు బదిలీలు జరపాలి

Inter employees should be transferred– మంత్రి సబితకు టిగ్లా వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియట్‌ విద్యలో పని చేస్తున్న ఉద్యోగులకు బదిలీలు జరి పించాలని ”తెలంగాణ ఇంటర్మీడియట్‌ గవర్నమెం ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌” డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణ గౌడ్‌, ఉపాధ్యక్షులు చంద్ర య్య, గోపాల్‌ నాయక్‌ కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించి సానుకూల నిర్ణయం తీసుకునెలా కృషి చేస్తామం టూ మంత్రి హామీ ఇచ్చారని తెలి పారు. ఈ కార్యక్రమంలో టిగ్లా రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు సైదులు, కృష్ణ, సంగీత పాల్గొన్నారు.