సేవలాల్ సేన 9వ ఆవిర్భవ వేడుకలను విజయవంతం చేయాలి… 

నవతెలంగాణ -చివ్వేంల :- సేవాలాల్ సేన 9వ ఆవిర్భావ వేడుకకు గిరిజన బిడ్డలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్య  నాగునాయక్ అన్నారు.. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే సేవాలాల్ సేన తొమ్మిదవ ఆవిర్భావ వేడుకలలో సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ పాల్గొంటున్నారని, గిరిజనులు అత్యధిక సంఖ్యలో పాల్గొని  ఆవిర్భావ వేడుకలని విజయవంతం చేయాలని సూచించారు. రాజ్యాధికారం దిశగా కలిసి కట్టుగా పయనించాలని పిలుపునిచ్చారు.