
నవ తెలంగాణ- జక్రాన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండల కేంద్రానికి చెందిన జక్కం కార్తీక్ ను తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ యూత్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ నియమిక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చొప్పరి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ముదిరాజ్ మన మహాసభ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జక్కం కార్తీక్ ని నియమించడం జరిగింది. కులాన్ని జాతిని ఐక్యం చేస్తూ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలను నిర్మాణం చేయడం ద్వారా ముదిరాజులను చైతన్యం చేసి అభ్యున్నతికి, పురోగతికి, సంక్షేమానికి, విద్యకి, ఉద్యోగాలకి, ఉపాధికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో పురోగతికి, కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జక్కం కార్తీక్ మాట్లాడుతూ తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చటంలో రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారంగా నాపై ఉంచిన నమ్మకంతో తగిన రీతిలో నా బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివయ్య, మద్దెల సంతోష్, బోలా కరుణాకర్, లక్ష్మీ గారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు