– మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జిల్లాల వారీగా అంగన్‌వాడీ యూనియన్లతో చర్చించి డిమాండ్లను తెలుసుకోవాలని మహిళా అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికా రులకు సూచించారు. శుక్రవారం సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళి కేరితో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్విహించారు. అంగన్ వాడీ యూని యన్లు సమ్మె బాటలోకి వెళ్తాయనే సంకేతాలతో మంత్రి స్పందించారు.ఆయా జిల్లాల్లోని యూనియన్లతో చర్చించి వారి సమస్యలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అండగా నిలిచిందన్న విషయాని వివరించారు.