– పదాధికారుల సమావేశంలో నిర్ణయాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ పదాధికారుల సమావేశం నిర్ణయించింది. అలాగే ఈనెల 11, 12 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 13, 14 తేదీల్లో నిరుద్యోగ సమస్యపై ఇందిరాపార్క్ వద్ద 24 గంటల నిరసన దీక్ష, 15వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి – ఓయూ – భైరాన్‌పల్లి – ఖిలాషాపూర్ – పరకాల వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.