అగ్రోలైఫ్‌ నుంచి” ట్రై కలర్‌” విడుదల

హైదరాబాద్‌ : అగ్రోకెమికల్‌ పరిశ్రమ రంగంలోని బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ లిమిటెడ్‌ కొత్తగా శిలీంద్ర సంహారిణి ”ట్రైకలర్‌”ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ట్రిఫ్లోక్సీస్ట్రోబిన్‌ 10 శాతం, డైఫెనోకోనజోల్‌ 12.5 శాతం, సల్పర్‌ 3 శాతం మిశ్రమంతో ఈ అత్యాధునిక శిలీంద్ర సంహారిణిని ఆవిష్కరించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇది వరి, టమాటా, ద్రాక్ష, మిరపకాయ, గోధుమలు, మామిడి, ఆపిల్‌ పంటల దిగుబడికి దోహదం చేస్తుందని బెస్ట్‌ ఆగ్రోలైఫ్‌ ఎండి విమల్‌ కుమార్‌ పేర్కొన్నారు.