– ఆ రాష్ట్ర టూరిజం డిప్యూటీ డైరెక్టర్ వెల్లడి
హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో విస్తృత పెట్టుబడులకు అవకాశం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్ పడోలే అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. తాము అందిస్తున్న పర్యాటక ఆఫర్‌లను ఆయన వివరించారు. సాంస్కృతిక, పురాతన కట్టడాలను దీర్ఘకాలిక పద్దతిలో లీజుకు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం, ఫ్రాంచైజీ పద్దతిలో అనేక పర్యాటక ప్రాంతాలను అభివృద్థి చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. సినిమా రంగంలోని వారికి షూటింగ్‌లకు సబ్సీడీని అందిస్తున్నామన్నారు. తమ రాష్ట్రం 785 పులులతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’ గా పేరొందిందన్నారు. దేశ, విదేశాల నుంచి కోవిడ్‌కు ముందు ప్రతీ ఏడాది 7.8 కోట్ల మంది పర్యాటకులు వచ్చే వారన్నారు. ఇందులో 50 లక్షల మంది విదేశీ పర్యాటకలు ఉండేవారన్నారు. తిరిగి కరోనా ముందు నాటి స్థాయికి పర్యాటకులు పెరిగారన్నారు.