సునీల్‌ యాదవ్‌కు తాత్కాలిక బెయిల్‌

నవతెలంగాణ -హైదరాబాద్‌
మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు హైకోర్టు 4 రోజులపాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంనేందుకు వీలుగా శని, ఆదివారా ల్లో అదేవిధంగా దశ దిన ఖర్మల్లో పాల్గొనేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో ఎస్కార్ట్‌ బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. బెయిల్‌ పూర్తి కాగానే సునీల్‌ లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నెల 7న సునీల్‌ తండ్రి మరణించడంతో ఎస్కార్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ వేయగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.