– మాజీ మంత్రి తుమ్మల ఖండన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో తుమ్మల మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. అసత్యాలతో ఆయన ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. చంద్రబాబు పట్ల రాజకీయ కక్ష్యతో దుర్మార్గంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. న్యాయప్రమాణాలు పాటించకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం దారుణమని నిరసన తెలిపారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తుమ్మల స్పందించారు.