హైదరాబాద్: హెల్త్‌వాచ్ టెలిడియాగ్నోస్టిక్స్ తన సేవలను విస్తరించేందుకు హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఇంటి వద్ద టెలి డయాగ్నోస్టిక్స్ సేవలందించే ఈ సంస్థ నగరంలో నివసిస్తున్న రోగులకు కంపెనీ తన ప్రీమియర్ ఎక్స్‌టెండెడ్ హోల్టర్, ఎబిపిఎం పరీక్ష సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. తమ కొత్త కార్యాలయం రోగనిర్ధారణ పరికరాలకు అనుకూలమైన యాక్సెస్‌ను నిర్ధారిస్తుందని తెలిపింది. రోగులు సరసమైన ధరతో ఇంటి వద్దనే రోగ నిర్దారణ సేవలు పొందవచ్చని పేర్కొంది. రోగులు హెల్త్‌వాచ్ వెబ్‌సైట్‌లో సులభంగా టెస్టును బుక్ చేసుకోవచ్చు లేదా ఏజెంట్‌తో మాట్లాడవచ్చని తెలిపింది.