దేశాధినేతలకు కరీంనగర్‌ బ్యాడ్జీలు

To the heads of state Karimnagar badgesన్యూఢిల్లీ : జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో తెలంగాణలోని కరీంనగర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్సులో కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ కళాకారుల కళాత్మక బ్యాడ్జీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిల్వర్‌ ఫిలిగ్రీ కళాకారులు వెండి తీగతో ప్రత్యేకంగా రూపొందించిన ‘అశోక చక్ర’ బ్యాడ్జీలు దేశాధినేతల సూట్‌పై తలుకులీనాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల కిందటే ఈ సిల్వర్‌ ఫిలిగ్రీ బ్యాడ్జీల కోసం ఆర్డర్‌ చేసింది. దీంతో కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ కళాకారులు 200 అశోక చక్ర బ్యాడ్జీలను తయారుచేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.