నవతెలంగాణ-ఆర్మూర్ : హైదరాబాదులోని శ్రీకృష్ణ రెసిడెన్సి జరిగిన తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఎన్నికలో వి ప్రభాకర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగా మోహన్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్, సాఫ్ట్బాల్ ఇండియా కోచ్ డాక్టర్ కృష్ణ, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి , జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ లు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సాఫ్ట్ బాల్ క్రీడా అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.