పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

మంత్ర ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రక్షిత్‌ అట్లూరి హీరోగా గొల్ల పాటి నాగేశ్వరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ, రాజరారు నిర్మిస్తున్న చిత్రం ‘పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ముహూర్తపు షాట్‌కు డైరెక్టర్‌ చందు మొండేటి క్లాప్‌ కొట్టగా, నిర్మాత ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,’ ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సస్పెన్స్‌, యాక్షన్‌ డ్రామా. పోలీస్‌ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ని ఏప్రిల్‌ 15 నుండి స్టార్ట్‌ చేస్తాం’ అని తెలిపారు. ‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అందరికీ ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది’ అని హీరో రక్షిత్‌ అన్నారు.