జోరుగా సాగుతున్న బెల్ట్ షాపుల నిర్వాహకం

– ఎలక్షన్ కోడ్ ముల్లంగించి హెదేచ్ఛగ బెల్ట్ షాపులు నిర్వాకం 

– తెలిసిన పట్టించుకుని అధికారులు 
– వారి వారికి సంబంధించిన రాజకీయ నాయకులు వారి దగ్గరనే మందుని డంపింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు
నవతెలంగాణ- పెద్దకొడప్ గల్:
మండల పరిసర ప్రాంత గ్రామాలలో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంది ఎన్నికల సంఘం ఎన్నికల ఉత్తర్వులు జారీ చేసిన బెల్ట్ షాప్ లో నిర్వాహకులు మాత్రం వారి దందాను యదేచ్ఛగా నడుపుతున్నారు. కొన్ని గ్రామాలలో అయితే ఏకంగా ఏకగ్రీవం చేసి ఒకరే అమ్మాలని తీర్మానాలు కూడా చేశారు. వారు అల్సుగా తీసుకొని వారికి సంబంధించిన రాజకీయ నాయకులతో చేయి కలిపి వారి వారి గ్రామాలలో ఎన్నికలకు సంబంధించిన మద్యాన్ని మా ద్వారా మీరు చెప్పిన వ్యక్తులకు మధ్య అందిస్తామని వారికి ఎంతో కొంత కమిషన్ ఇవ్వమని ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించకపోవడం ప్రశ్నార్థకమని పై అధికారుల ఆదేశాల మేరకే బెల్టు షాపులపై దాడులు నిర్వహించటం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.గతంలో ఎన్నికల సమయం వస్తే బెల్టు షాపులు కానీ కళ్ళు దుకాణాలు కానీ దాబా హోటల్లు కానీ వారికి ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ సంబంధిత దాడులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు నిర్వాహకులు మాత్రం ఎదేచ్ఛగా మద్యాన్ని అమ్ముతున్నారు వారిని ప్రశ్నించగా సంబంధిత అధికారులకు ఏమి ముడుపు చెల్లించాలో అది చెల్లించామని దర్జాగా చెప్పడం ఘమనార్థమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎన్నికల సమయంలో మద్యం ఏరులై పారుతుందని దీనికి అరికట్టాల్సిన శాఖ వారే నిమ్మకు నీరతనట్టు వివరించడం సిగ్గుచేటు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత జిల్లా శాఖ వారు స్పందించి ఈ బెల్ట్ షాపునులను అరికట్టాలని ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.