ఆర్మూర్ పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో వ్యాపారి పరార్

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మడిగిలలో వ్యాపారం చేసే వ్యక్తి మూడు కోట్ల రూపాయలతో పారిపోయినట్లు తెలిసింది .గత కొన్ని సంవత్సరాల నుండి ఉంటూ పట్టణంలోని ప్రముఖుల నుండి ఫైనాన్స్ చేసే వారి వద్ద నుండి, సిడి వ్యాపారులు, వడ్డీ వ్యాపారుల వద్ద, ఫైనాన్స్ చేసే వారి వద్ద నుండి ఎంతో నమ్మకంతో ఉంటూ ఒకరికి తెలియకుండా మరొకరి నుండి సుమారుగా మూడు కోట్లు డబ్బులు తీసుకొని రాత్రికి రాత్రే పరారైన సంఘటన పెరుగులోకి వచ్చింది. డబ్బులు ఇచ్చిన ప్రముఖులు ఫైనాన్స్ వారు కొన్ని రోజుల నుండి దుకాణం తీయకపోవడంతో అనుమానం వచ్చి దుకాణ యజమానికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బాధిత వ్యక్తులు లబోదిబో మన్నారు.. గత నెల రోజుల నుండి దుకాణానికి ఇంటికి తాళం వేసి పట్టణం నుండి పరారు అయిన బాధిత వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం కొసమెరుపు.