జోరందుకున్న నామినేషన్ల పర్వం

అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం అచ్చంపేటలో జోరుగా నడుస్తున్నాయి బుధవారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ చిక్కుడు వంశీకష్ణ నామినేషన్‌ దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి నుండి గువ్వల బాలరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ ను అచ్చంపేట ఎన్నికల అధికారి గోపిరామ్‌ అందజేశారు. ఇప్పటికే బహుజన సమాజ్‌ పార్టీ నుండి నాగార్జున నామినేషన్‌ దాఖలు చేశారు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
తెలకపల్లి: మండల పరిధిలోని దాసుపల్లి గ్రామానికి చెందిన చీమర్ల రాజేశ్వర్‌ రెడ్డి బుధవారం నాగర్‌ కర్నూల్‌ నియో జకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసినట్లు తెలి పారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేసినట్లు తెలిపారు రాజేశ్వర్‌ రెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాసుపల్లి గ్రామస్తులు శంకర్‌, అర్జున్‌ రెడ్డి, వీరారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి: వనపర్తి నియోజకవర్గం లో 6వ రోజు మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్‌ అధికారి ఎస్‌. తిరుపతి రావు తెలిపారు. మంగంపల్లి గ్రామం పెద్దమందడి మండలం వనపర్తి జిల్లా కు చెందిన తూడి మెఘారెడ్డి తండ్రి సాయిరెడ్డి తుడి 51 సంవత్సరాలు వయస్సున్న అభ్యర్థి కాంగ్రెస్‌ పార్టీ తరపుననామినేషన్‌ వేసారని తెలిపారు. గొండి వెంకటరమణ అభ్యర్థి ఇండిపెండెంట్‌ గా, చేన్నారం గ్రామం, రేవల్లి మండలం వనపర్తి జిల్లాకు చెందిన బంకల ఎల్లయ్య తండ్రి చిన్న బాలయ్య, 40 సంవత్సరాల వయస్సు న్న అభ్యర్థి ధర్మ సమాజ్‌ పార్టీ తరపున నామినేషన్‌ దాఖలు చేశా రని పేర్కొన్నారు. నామినేషన్‌ ప్రారంభమైన రెండవ రోజు ఒక నామినేషన్‌ రాగా అయిదవ రోజు అయిన మంగళ వారం ఒక నామినేషన్‌, ఆరో వ రోజు అయిన బుదవారం మూడు నామినేషన్లు వనపర్తి నియోజకవర్గం నుండి దాఖలు అయినట్లు ఆయన తెలిపారు.
మహబూబ్‌ నగర్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల కు నామినేషన్ల గడవు ఇంకా రెండు రోజులు ఉండడంతో పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం మహబూబ్‌ నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా నితిన్‌ కుమార్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మెట్టు గడి శ్రీనివాస్‌ నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌ గౌడ్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ మహిళ అధ్యక్షురాలు బెక్కరి అనిత, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాఘవేందర్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.