
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విలువచేసి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో పోలీసు సిబ్బందితో కలిసి ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో గోవిందరావుపేట మండల కేంద్రంలో ఒక మహిళ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యం నిల్వచేసి విక్రయిస్తూ పట్టబడడం జరిగిందన్నారు మద్యం ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై మస్తాన్ పేర్కొన్నారు. మద్యం విక్రయిస్తున్న నిందితురాలి పేరు అజ్మీర పద్మ అని ఆమె నుండి 7557/- రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.