నవతెలంగాణ- రెంజల్: ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి సుదర్శన్ రాజు పై రెంజల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎంఏ అజార్ వీరన్న గుట్ట శివారులో అర ఎకరం భూమిని కొనుగోలు చేయగా, రోడ్డు బోండ్రి లో రిటైర్డ్ ఎస్సై సుదర్శన్ రాజ్, అతని కుమారుడు సందీప్ రాజ్ లు తన భూమికి దారి ఇవ్వకుండా టీం షెడ్డును ఏర్పాటు చేశారని, తన పొలం కు వెళ్లడానికి దారి ఇవ్వమని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సాయన్న 151/2022 లో యు ఎస్/341, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.