ప్రభుత్వ హాస్పిటల్ పై దాడి ఘటనలో మృతిని బంధువులపై కేసు నమోదు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై దాడి ఘటనలో మృతుని బంధువులపై కేసును నమోదు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు కేసు నమోదు చేసినట్లు బుధవారం తెలిపారు.నిన్న అనగా 16.5 2023 మంగళవారం న బాలరాజు అనే పేషంట్ పదిహేను రోజుల క్రితం భిక్నూరు మండలం కామారెడ్డిలో గుర్తుతెలియని వాహనానికి రోడ్ యాక్సిడెంట్ అయి చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతుడికి డయాబెటిస్ ఉండటంచే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచిపెట్టడం జరిగింది ఇట్టి విషయంలో మృతుని బంధువులు అనాలోచితంగా హాస్పటల్ మరియు వైద్య సిబ్బందిపై దాడి చేసే చేయడం కారణంగా హాస్పటల్ సూపర్డెంట్ ప్రతిమ రాజ్ ఫిర్యాదు పై వన్ టౌన్ పిఎస్ యందు అండర్/సెక్షన్ 353 ఐపీసీ పీడీ పి పి యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ మెడికల్ సర్వీసెస్ ఆక్ట్ కింద వన్ టౌన్ పిఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలియజేశారు.