నవతెలంగాణ-వీణవంక
రేషన్ డీలర్ ను డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించిన కేసులో ఓ విలేకరిపై కేసు నమోదు చేసినట్లు వీణవంక ఎస్సై ఎండీ ఆసిఫ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కోట సుజాతను అదే గ్రామానికి చెందిన మాడ కరుణాకర్ రెడ్డి అనే అతను తాను రిపోర్టర్ ను అంటూ రూ.30వేలు ఇవ్వాలని, లేకుంటే లైసెన్స్ రద్దు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.