మహిళా అదృశ్యం కేసు నమోదు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామానికి చెందిన జంగం శీరీష బుధవారం రాత్రి నుండి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వేళ్ళని పోయిందని ఇదే విషయమై శీరీష అత్తా జంగం మణియమ్మ గురువారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సిలివేరి మహేష్ తెలిపారు.అయన తేలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామానికి చెందిన జంగం రంజీత్ కు గత 7 ఏళ్ల క్రితం సదాశివ్ నగర్ మండలం లోని దగ్గి గ్రామానికి చెందిన జంగం శీరీష తో జంగం రంజిత్ కు వివాహం జరిగిందన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, బతుకుదెరువు కోసం భర్త జంగం రంజిత్ గల్ఫ్ లోని దుబాయ్ కి వేళ్ళడని వివరించారు.బుదవారం 19న కోడలు షీరీషాతో కలిసి 9 గంటల ప్రాంతంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.రాత్రి 11 గంటల సమయంలో తన పిల్లలను వదిలి వేళ్ళని పోయిందని,చిన్న కుమారుడి ఏడుపు శబ్దాన్ని విన్న అత్తా అనంతరం గదిలోకి వెళ్లి చూడగా ఇంట్లో నుంచి కోడలు కనిపించడం లేదు. ఆ తర్వాత అదే విషయాన్ని బంధువులకు సమాచారం అందజేశారు. చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు బ్లూ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకుందని, గ్రామంలోని శ్రీకాంత్‌ పై తమకు అనుమానం ఉందని వివరించినట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎస్సై సిలివేరి మహేష్ వివరించారు.