పేపర్‌ లీకేజీ కేసును

– సీబీఐకి అప్పగించాలి : వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పేపర్‌ లీకేజీపై బుకాయించటం కాకుండా సీబీఐకి ఆ కేసును అప్పజెబితే అసలు ముద్దాయిలు ఎవరనేది తేలుతుందని వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. లీకేజీ బండారం బయట పడే సరికి టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంతో తమకు సంబంధం లేదంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారని విమర్శించారు. స్వతంత్ర పతిపత్తి గల సంస్థలు సర్కారు పరిధిలో ఉండబోవంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు ఉంటే అసలు ఖాళీలే లేవని చెప్పడం శోచనీయమన్నారు.