‘మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో కేంద్రీకృత విధానం సరికాదు’

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో కేంద్రీకృత విధానం సరైంది కాదని చేవెళ్ల ఎంపీ జి రంజిత్‌రెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర వైద్యశాఖ మంత్రి మనుసూఖ్‌ మాండవీయ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023-24 విద్యా సంవత్సరానికిగానూ తాము మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో కేంద్రీకత విధానం అవలంభించడం లేదని తెలిపారు. భారత సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన నియమ నిబంధనలకు లోబడే, పాత ప్రక్రియ లోనే మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌ను చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. మెడికల్‌ సీట్లలో కేవలం 15 శాతం మాత్రమే ఆలిండియా కోటా ఉంటుం దని వివరించారు.