– క్రీడాకారులు మధ్య హేమ శ్రీ పుట్టిన రోజు
– ఆటగాళ్ళకు శీతల పానీయం,పండ్లు అంద జేసిన తాత “బిర్రం”
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిహ్వకో రుచి – పుర్రెకో బుద్ది అనే నానుడి ని కొందరు రుజువు చేస్తున్నారు. సాధారణంగా పుట్టిన రోజు ను ఇంట్లో జరుపుకుంటారు. కానీ ఓ చిన్నారి మనవరాలి కోరిక మేరకు తాత ఆమె పుట్టిన రోజును క్రీడాకారులు మధ్య జరిపారు. తెరాస గ్రామీణ ప్రాంత నాయకులు,టెలికాం అడ్వైజరీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరరావు (తనయుని కుమార్తె ) మనవరాలు హేమ శ్రీ పుట్టిన రోజును శుక్రవారం క్రీడాకారుల మధ్య నిర్వహించారు. మండలంలోని గాండ్లగూడెం లో గురువారం ప్రారంభం అయిన మెచ్చా క్రికెట్ లీగ్ శుక్రవారం కొనసాగింది.ఈ క్రమంలో వినాయకపురం కు చెందిన వెంకటేశ్వరరావు మనవరాలు హేమ శ్రీ తో సహా గాండ్లగూడెం వెళ్ళి క్రీడాకారులు మధ్య పుట్టిన రోజు జరుపుకున్నారు.ఈ సందర్భంగా క్రీడాకారులు, ప్రేక్షకులకు 100 మందికి శీతల పానీయం తో పాటు మామిడి పండ్లు అందజేసారు.అనంతరం క్రీడాకారులు హేమ శ్రీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనవరాలి పుట్టినరోజు శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్నపాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కమిటీ ఆహ్వాన మేరకు ఇక్కడికి విచ్చేసి ఆశీస్సులు అందజేసిన క్రీడాకారులకు,కమిటీ సభ్యులకు ప్రోత్సాహం అందజేయడం జరిగిందని ఆన్నారు.ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఆటలు ఆడడం ఎంతో ఉపయోగకరమని సమయస్పూర్తి తో ఆడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాండ్లగూడెం బీఆర్ఎస్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మాలోతు చంద్రకళ, ఆలీ బాబు, కునుసోతు నవీన్ నాయక్, వంశీ, చందు, శ్రీహరి, రామకృష్ణ, శ్రీకాంత్, రవి, బానోతు రాంజీ, లాలు, ప్రసాద్, క్రికెట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.