– గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో మహిళపై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి 48 గంటల్లోపు సమగ్ర నివేదికను అందించాలని ఆమె ఆదేశించారు.
లైంగిక దాడి, హత్య అత్యంత దుర్మార్గం మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో మహిళపై లైంగిక దాడి, హత్యపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితా లక్ష్మారెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని కమిషన్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను సునితా లక్ష్మారెడ్డి ఆదేశించారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి ఘటనపై మహిళా కమిషన్ కు నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.