ఉద్యోగిని చితక బాదిన కానిస్టేబుల్‌..?

– చర్య తీసుకోవాలని స్టేషన్‌లో ఫిర్యాదు..
నవతెలంగాణ-మరిపెడ
ప్రభుత్వ ఉద్యోగి చితకబాదిన సంఘటన మరి పెడ పోలీస్‌ స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గురువారం బాధితుడు ఎస్‌కె మహబూ బ్‌, నర్సింహాలపేట మండలం మంచ్య తండ మం డల ప్రాథమిక పాఠశాల యందు ఉపాధ్యాయు నిగా పనిచేస్తున్నారు. బుధవారం విధి నిర్వహణలో భాగంగా ఎస్‌టిఓ ఆఫీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఓ ఫైనాన్స్‌ విషయంలో వ్యవసాయ శాఖలో పనిచేస్తు న్న రహీం అనే వ్యక్తితో నాతో గొడవపెట్టుకున్నా రని మహబూబ్‌ పేర్కొన్నారు. గల్ల పట్టుకొని పో లీస్‌ స్టేషన్‌కు గుంజకొచ్చి యాకుబ్‌ అనే హెడ్‌ కా నిస్టేబుల్‌కు నన్ను అప్పజెప్పారు. అంతేగాక అతని కి కొన్ని డబ్బులు ఇచ్చి చితకకొట్టండి అంటు హు కుంజారీ చేశారు. దీంతో కానిస్టేబుల్‌ నాపై లాఠీకర్రతో నా మోకాలు చిప్ప పగిలేటట్టు కొట్టి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో నేను గురువారం వరంగల్‌ ఎంజీఎం శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. మోకాలు చిప్ప పగిలి గాయాలతో వచ్చి నాపై అకారణంగా దాడి చేసిన రహీం, అట్లాగే నన్ను కొట్టిన హెడ్‌ కానిస్టేబుల్‌ యాకుబ్‌ ఖాన్‌ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే విషయంపై విలే కరులు స్థానిక ఎస్సై ని వివరణ అతనిపై చర్య తీసుకుంటామని, పై అధికారులకు రి పోర్ట్‌ చేస్తామన్నారు. చిత్రహింసలకు గురిచేసిన బాధితులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.