బిల్డింగ్‌పై నుంచి పడి భవన కార్మికుడు మృతి

భార్యకు వెన్ను విరిగి, తీవ్రగాయాలు
– మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్‌లో ఘటన
నవతెలంగాణ-మియాపూర్‌
బిల్డింగ్‌పై నుంచి కింద పడి భవన కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మాదాపూర్‌ ఇజ్జత్‌ నగర్‌లో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రమణ అనే బిల్డర్‌ ఖానామెట్‌ ఇజ్జత్‌నగర్‌లో 60 గజాల స్థలంలో ఆరు అంతస్థుల బిల్డింగ్‌ నిర్మాణ పనులు చేపట్టాడు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ వద్ద గద్వాల్‌ జిల్లాకు చెందిన దంపతులు కృష్ణ(35) అతను భార్య కవిత ఈ భవ నంలో నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా 5వ అంతస్తులో మిగతా కూలీలతో పాటుగా పనిచేస్తున్నారు. వీరు కట్టెలపై నిలబడి పనిచేస్తున్న క్రమంలో అవి ఒక్కసారిగా విరిగిపోవడంతో ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్‌ గుంతలోకి పడి కృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. అతని భార్య కవితకు వెన్నుపూస విరగి, తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దంపతులకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరి గిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, బిల్డర్‌ రమణపై కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.
బిల్డర్‌పై కేసు నమోదు చేయాలి : సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్‌ కార్యదర్శి కొంగరి కృష్ణ
మాదాపూర్‌ కామెంట్‌ వికర్‌ సెక్షన్‌ కాలనీలో కార్మికుడు మతి చెందడానికి కారణమైన బిల్డర్‌ రమణ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్‌ కార్యదర్శి కొంగరి కృష్ణ డిమాండ్‌ చేశారు. అసలు పర్మిషన్‌ లేని ప్రాంతంలో బౌల్‌ అంతస్తుల నిర్మాణ పనులు చేపడుతున్న జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ఫిర్యాదు పలుమార్లు ఫిర్యాదు చేసినా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించకపోవడానికి ఇది నిదర్శనమన్నారు. మృతిని కుటుంబానికి రూ.20 లక్షల ఇచ్చి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. గాయపడిన అతని భార్య చికిత్స ఖర్చులు పూర్తిగా బిల్డర్‌ భరించాలని డిమాండ్‌ చేశారు.
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి :ఏఐటీయూసీ శేర్లింగంపల్లి కార్యదర్శి చందుయాదవ్‌
కనమెట్టు వికసిక్షన్‌ కాలనీలో ప్రమాదవశాత్తు భవనం నుంచి కిందపడి మృతి చెందిన భవన కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఐఐటీయూసీ కార్యదర్శి చందు యాదవ్‌ డిమాండ్‌ చేశారు.ఈ ఘటనలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధకరమన్నారు. మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.