బోధన్ లో ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ

– -బస్సులో ఉన్న ఒకరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

– మరో 35 మంది సురక్షితంగా ఉన్నారు.
– ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని అంబులెన్స్ లో రామాయంపేట ప్రభుత్వ ఆసుపతికి తరలించారు.

నవ తెలంగాణ ; బోధన్ టౌన్

బోధన్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ కు వెళ్ళుతున్న బస్సు కు రామాయణపేట్ సమీపంలో ముందు వెళ్తున్న బోధన్ ఆర్టీసీ బస్సు సడన్ గా బ్రేక్ వేయడంతో దాని వెనకాలే వస్తున్న కంటైనర్ వాహనం బస్సును ఢీకొట్టింది. బస్సులో ఉన్న ఒకరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 35 మంది సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని అంబులెన్స్ లో మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపతికి తరలించారు.మిగతా ప్రయాణికులు వేరే బస్సులో వారి గమ్యస్థానానికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.