కుదిరితే ఒక కప్పు బుల్లెట్‌ కాఫీ

A cup if possible Bullet coffeeనెయ్యి కాఫీ.. దీనిని బుల్లెట్‌ ప్రూఫ్‌ కాఫీ అని కూడా పిలుస్తారు. ఇది నెయ్యి లేదా శుద్ధి చేయబడిన వెన్నతో తయారు చేస్తారు. దీనికి మన దేశంలో చాలా డిమాండ్‌ ఉంది. ఈ రిచ్‌ కాఫీ మనకు తక్షణ శక్తిని అందిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.
దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం.
– నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కెఫీన్‌ విడుదలను నెమ్మదిస్తాయి. దీని కారణంగా ఈ కాఫీ తాగిన వారికి రోజంతా శక్తి లభిస్తుంది.
– ఈ నెయ్యి కాఫీలో కీటో కార్బ్‌ డైట్‌లు తక్కువగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల.. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కొవ్వును కరిగించేందుకు ఈ బుల్లెట్‌ ప్రూఫ్‌ కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
– నెయ్యిలో బ్యూటిరేట్‌ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఈ కాఫీని గట్‌-ఫ్రెండ్లీగా కూడా పిలుస్తుంటారు
– నెయ్యిలో ఆరోగ్యానికి అవసరమైన ఎ, డీ, ఈ, కె వంటి విటమిన్స్‌ ఉంటాయి. ఇవి సులువుగా కొవ్వులో కరిగిపోతాయి.
ఎలా తయారు చేసుకోవాలి?
ఈ కాఫీ తయారు చేయడం చాలా సులభం. ఈ కాఫీని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
మీకు నచ్చిన పద్ధతిని ఉపయోగించి ఒక కప్పు బ్లాక్‌ కాఫీని తయారు చేసుకోవాలి. అనంతరం ఆ వేడి వేడి బ్లాక్‌ కాఫీని బ్లెండర్‌లో పోయాలి. ఆ బ్లెండర్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి కలపాలి. కావాలనుకునేవారు అదనంగా పాల క్రీమ్‌ కూడా వేసుకోవచ్చు. అందులో ఒక స్పూన్‌ కొబ్బరి నూనె వేసుకుంటే ఇంకా మంచిది. పైన చెప్పినవన్నీ బ్లెండర్‌లో వేసుకున్న తరువాత కాఫీ స్మూత్‌గా, నురువు వచ్చేంత వరకు సుమారు 20 నుంచి 30 సెకన్ల పాటు బ్లెండ్‌ చేసుకోవాలి. అనంతరం కాఫీని ఒక గ్లాస్‌లో తీసుకొని దానికి రుచికి తగ్గట్టు స్టెవియా లేదా మాంక్‌ ఫ్రూట్‌ జ్యూస్‌ను కలుపుకుంటే ఆ కాఫీని బాగా ఆస్వాదించొచ్చు.