
మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన అమోస్ రోజూ కూలి పని చేస్తూ తన జీవనాన్ని సాగించేవాడు. దురదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితం ఆయనకు రక్త కణాలు ఒక్కసారిగా పడిపోవడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య నవనిత, ఇద్దరు కూతుళ్లు సహస్త్ర (4), శాన్విత(2) ఉన్నారు.వారిది నిరుపేద కుటుంబం, ఆయన మరణంతో వారి కుటుంబం అనాధగా మారింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించారు. చిన్న పిల్లలు ఉండడంతో వారిని భవిష్యత్తులో మంచిగా చదివించి ప్రయోజకులను చేయాలని మృతిని భార్యకు చూపించారు.ఇద్దరు ఆడ పిల్లల కోసం రూ.50వేలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. వారి తక్షణ అవసరాల కొరకు రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, పడిగెల ప్రవీణ్, ఎడ్ల శ్రీకాంత్, తెడ్డు రమేష్, సుంకేట శ్రీను, బద్దం రవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.