– విప్లవాత్మక ఉద్యమానికి దిశానిర్దేశం చేయడానికి
– ఒక సామూహిక విప్లవ పార్టీని నిర్మించడం చాలా అవసరం
– సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ జిల్లా సిపిఎం రంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులకు శాఖ కార్యదర్శులకు రెండు రోజులు రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం కాగా ముగింపు రోజు ఐనా శనివారం ప్రిన్సిపాల్ గా మాలోతు సాగర్ వ్యవహరించిన ఈ క్లాస్ కి ముఖ్య అతిదులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య , రాష్ట్ర కమిటీ నాయకులు కామ్రేడ్ అబ్బాస్,లు హాజరై ప్రసంగించారు మొదటి సెషన్ టీచర్ గా సిపిఎం రాష్ట్ర నాయకులు అబ్బాస్ బోదిస్తు పార్టీ నాయకులను ఉద్యేశించి మాట్లాడరూ దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితితులు ఎలా ఉన్నాయో వివరించారు. ఇదేగాక ప్రజల ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి భారత ప్రజల ముందు తన విప్లవాత్మక కార్యక్రమాన్ని ఉంచుతుంది అని అన్నారు. ప్రజల ప్రజాస్వామ్య విప్లవం సోషలిజానికి దోపిడీ రహిత సమాజానికి మార్గాన్ని తెరుస్తుందన్నారు . భారతీయ ప్రజలను విముక్తి చేయడానికి ఇటువంటి విప్లవం రైతుతో కలిసి కార్మికవర్గం నాయకత్వం వహించాలన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, కార్మికవర్గానికి అగ్రగామిగా కమ్యూనిస్ట్ పార్టీ సామ్రాజ్యవాదం, గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానం భూస్వామ్యానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలకు నాయకత్వం వహించాలి అని పేర్కొన్నారు. మన దేశంలో ఉన్న పరిస్థితులకు మార్క్సిజం-లెనినిజం సూత్రాలను నిర్దిష్టంగా వర్తింపజేయడం ద్వారా, పార్టీ విజయం సాధించే వరకు రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కతిక అన్ని రంగాలలో సుదీర్ఘ పోరాటాలు నిర్వహించాలి అని అన్నారు .
పెట్టుబడిదారీ దోపిడీ పరిస్థితులలో రాజ్యాంగం అందించిన మైనారిటీలకు హామీ ఇచ్చిన హక్కులు కూడా అమలు చేయబడవు అన్నారు . ఆర్థిక, సామాజిక రంగాలలో ముస్లిం మైనారిటీల పట్ల సమాన అవకాశాలు లేకపోవడం వివక్ష ఉందనీ. మతపరమైన అల్లర్లు ముస్లింలపై హింసాత్మక దాడులు శాశ్వత లక్షణంగా మారాయన్నారు. మైనారిటీ మతతత్వం మైనారిటీలను ఒంటరి చేస్తుందనీ అన్ని అణగారిన వర్గాల ఉమ్మడి ఉద్యమానికి ఆటంకం కలిగిస్తుందనీ అన్నారు. ప్రజాస్వామ్యం లౌకికవాదాన్ని బలోపేతం చేసే పోరాటంలో మైనారిటీ హక్కుల రక్షణ కీలకమైన అంశం. రెండవ సెషన్ బోడించడానికి ముఖ్య అతిధి గా కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య హాజరై మాట్లాడుతూ అన్ని రంగాలలో పోరా టాన్ని నిర్వహించడానికి విప్లవాత్మక ఉద్యమానికి దిశానిర్దేశం చేయడానికి ఒక సామూహిక విప్లవ పార్టీని నిర్మించడం చాలా అవసరం అని నాగయ్య అన్నారు. అటువంటి పార్టీ ప్రజా ఉద్యమాలను అభివద్ధి చేయడం ద్వారా ప్రజలలో తన పునాదిని నిరంతరం విస్తరించుకోవాలి మరియు రాజకీయంగా మరియు సైద్ధాంతికంగా దాని ప్రభావాన్ని స్థిరీకరించాలన్నారు . దీనికి ప్రజాస్వామ్య కేంద్రీ కరణపై ఆధారపడిన బలమైన, క్రమశిక్షణ గల పార్టీ అవసరం ఎంతో ఉందన్నారు. దేశంలో పేద మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరడే పార్టీ ఏదైనా ఉంది అంటే కమ్యూనిస్ట్ పార్టీనే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రంగశాయిపేట ఏరియా కమిటీ సభ్యులు తాటికాయల రత్నం దాసు, మాలోతు ప్రత్యుష, మన్నూరు జ్యోతి ,గణేపాక ఓదెలు, ప్రజా సంఘాల బాద్యులు డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, ఉపాధ్యక్షులు రామ సందీప్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు చుక్క ప్రశాంత్ ,కేవీపీస్ ఏరియా కార్యదర్శి ఉసిల్ల కుమార్, ఆవాజ్ కమిటీ ఏరియా కార్యదర్శి యండి అతిక్, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, ఉపాధ్యక్షులు సతీష్ ,ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు దాసారపు అనీల్, సీఐటీయూ శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కూన రాధికా మరియు శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.