వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే దశాబ్ది ఉత్సవాల డ్రామా

– టిఆర్ఎస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ధ్వజం
నవతెలంగాణ కంఠేశ్వర్
        వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి దశాబ్ది ఉత్సవాల డ్రామా టిఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిందని మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ భవన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి, సోనియా గాంధీ  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఫలించిన రోజు.శ్రీమతి సోనియా గాంధి గారి కరుణ కటాక్షలతో వందల మంది అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమాలు, తెలంగాణ ఆత్మ గౌరవం కొరకు, తెలంగాణ ప్రజల నిధులు, నియామకాలు, నీళ్ళు దోచుకుంటున్న ఆంధ్ర పాలకులపై 60 సంవత్సరాలు అలుపెరగని పోరాటంతో ముందుకెళ్లిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో, సోనియా గాంధీ l ఆదేశంతో ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు.ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు సుమారు దశాబ్దికాలంగా యువకులు, నిరుద్యోగులు, రైతులు ,బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేర్చకపోగా ,తెలంగాణ ప్రజల జీవితాలు మారకపోగా, ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితిని కేసీఆర్ సృష్టించాడని ,కచ్చితంగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకునే నైతిక హక్కు లేదు అని ,కచ్చితంగా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సోనియాగాంధీ లక్ష్యం ,తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవీరుల కుటుంబాలను ఆదుకునే విధంగా ఆ కుటుంబాలకు నెలకు 25 వేల రూపాయల పెన్షన్, గుర్తింపు కార్డు, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
                    
         అంతేకాకుండా నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, కేసీఆర్ ,బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను సరిదిద్ది అమరవీరుల ఆశయాలను, సోనియా గాంధీ లక్ష్యాలను నెరవేర్చే విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు  తాహీర్ బిన్ హాందం, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రూరల్ ఇంఛార్జి భూపతి రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఆధ్యాక్షులు వేణు రాజ్, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి విపూల్ గౌడ్, కార్పొరేటర్ రోహిత్, జిల్లా ఓ బి సి అధ్యక్షులు నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అభుద్ బిన్ హాంధన్, పిసిసి మెంబర్ ఈసా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్ర కల , ఉష, మలైకా బేగం, అబ్దుల్ ఏజజ్, వినయ్, సేవాదళ్ సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ కృష్ణ, ముస్తాఫ, వినోద్, అశ్రఫ్, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.