నవతెలంగాణ-అనంతగిరి
పెండ్లి వేడుకల్లో అపశృతి జరగడంతో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని బొజ్జగూడెంలో సోమవారం చోటుచేసుకుంది.ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం..బొజ్జగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన భూక్యా కోట్యా కుమార్తె వివాహం అనంతరం రాత్రి పెండ్లి ఊరేగింపు నడుస్తుండగా పెండ్లి కుమార్తె వరుడు ఇరువురు ఉన్న కారులో కూర్చొని ఊరేగింపు వెళ్తున్నారు.అదే కారులో వెనుక సీటులో కూర్చున్న బానోతు వెంకటేశ్వర్లు కుమార్తె బానోతు ఇంద్రజ(09), కారు వెనక సీట్‌లో కూర్చొని తలకాయ బయట పెట్టుకొని డ్యాన్స్ చూస్తుండగా కార్ డ్రైవర్ శేఖర్ నిర్లక్ష్యంగా కారు అద్దం బటన్ నొక్కి పైకి లేపినట్లు తెలిపారు.అదే సమయంలో డోర్ గ్లాసుల మధ్యన పాప మెడపడి ఊపిరాడక్క అక్కడికక్కడే మృతి చెందింది.మతురాలి తండ్రి బానోతు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కార్ డ్రైవర్ శేఖర్‌పై కేసు నమోదు చేశారు.బాలిక శవానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.