
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు లేవు, కళాశాలకు ప్రహరీ గోడ లేక పోవడం వల్ల కళాశాల ఆవరణలో పాములు, పశువులు వస్తున్నాయి వీటివల్ల విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారని, అదేవిధంగా తరగతి గదులలో విద్యుత్ సదుపాయం లేదు, ఫ్యాన్ లు తిరగడం లేదు, మధ్యాహ్నభోజనం సమయంలో చేతులు కడుక్కోవడానికి నీటివసతి లేదు, వేరు వేరు మూత్రశాలు ఉన్నపటికీ అబ్బాయిలు మూత్ర విసర్జనకు బయటికి వెళ్తున్నామని కళాశాల వరండాలో ఫ్లోర్ బాగు లేదని విద్యార్థులు వాపోతున్నారు. కావున మండల అధికారులు, ప్రజాప్రతినిధులు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దృష్టికి తీసుకెళ్లి సమస్యలను స్సత్వరం పరిష్కరించాలని కోరుతున్నారు లేనిచో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమం లో ఎం ఎస్ యు యాదవ్ బాలు షిండే పాల్గొన్నారు.