రాంపూర్ లో ఘనంగా బోనాల ఊరేగింపు..

– హాజరైన మాజీ ఎమ్మెల్సీ వి జి గౌడ్.
నవతెలంగాణ- డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ పాల్గొని బోనాలు సమర్పించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అద్యక్షుడు దశగౌడ్, నాయకులు రమేష్ గౌడ్, రామాగౌడ్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేష్ గౌడ్ తోపాటుబారి సంఖ్యలో మహిళలు గౌడ సంఘ సబ్యులు పాల్గొన్నారు.