నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్రంలతో పాటు ఘనపూర్, తిర్మన్ పల్లి గ్రామలలో ఆదివారం ఘనంగా ఊర పండుగ నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి అందరు ఆర్థికంగా బాగుపడి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయా గ్రామాల గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు శక్కరి కొండ కృష్ణ, కుర్రి రామకృష్ణ, గోపు గోవర్దన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.