ఘనంగా వీఐటీ ఏపీ స్నాతకోత్సవం

A grand VIT AP graduation ceremonyనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) ఏపీ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ద జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ చైర్మెన్‌ డాక్టర్‌ జస్టిస్‌ బి శివశంకర్‌రావు మాట్లాడుతూ కష్టపడే తత్వం, అంకితభావం, క్రమశిక్షణ ఉండే విద్యార్థులకు విజయం వరిస్తుందని చెప్పారు. స్నాతకోత్సవం అంటే విద్యార్థుల కలలు ప్రతిఫలించే రోజని అన్నారు. మైక్రోసాఫ్ట్‌ డైరెక్టర్‌ ఆశీష్‌ శర్మ మాట్లాడుతూ కష్టపడే విద్యార్థులు అంకితభావంతో పనిచేసే వారే సవాళ్లను సులువుగా ఎదుర్కొంటారని చెప్పారు. మంచి వ్యక్తిత్వం, నైపుణ్యం ఉంటే అపజయాలు రాబోవని స్పష్టం చేశారు. వీఐటీ ఏపీ చాన్సలర్‌, వ్యవస్థాపకులు జి విశ్వనాథన్‌ మాట్లాడుతూ భవిష్యత్తు నాయకులను తయారు చేసేదిశగా ఈ వర్సిటీ పనిచేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ఎస్‌వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ జగదీశ్‌సి ముదిగంటి, డీన్‌ అకడమిక్స్‌ ఎన్‌ మధుసూదన్‌రావు, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఖదీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో 16 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందించడంతోపాటు 1,611 మంది పట్టాలను అందజేశారు.