ఘనంగా అ‘పూర్వ’ సమ్మేళనం

– వీణవంక హైస్కూల్లో గాంధీ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ -వీణవంక
మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన పదోతరగతి 1991-1992 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన పాఠశాలలో సర్పంచ్ నీల కుమారస్వామి, ప్రధానోపాధ్యాయుడు పులి అశోక్ రెడ్డి, పూర్వ ఉపాధ్యాయుల చేతుల మీదుగా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.