కామర్స్ దిగ్గజానికి ఘన సన్మానం..

నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సందర్భంగా కామర్స్ విభాగ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆరతి, గెస్ట్ ఆఫ్ హానర్ గా పిఆర్ఓ డాక్టర్ ఏ పున్నయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ వాసం చంద్రశేఖర్ హాజరయ్యారు. కార్యక్రమానికి కామర్స్ డీన్ ప్రొఫెసర్ రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు అధ్యాపకులు, విద్యార్థులు ప్రొఫెసర్ ఎం యాదగిరి విద్యా రంగంలో చేసిన కృషిని విద్యార్థులను వెన్నుంటి నడిపించిన తీరును కొనియాడారు. ప్రిన్సిపల్ ఆరతి మాట్లాడుతూ ఆచార్య యాదగిరి గొప్ప పరిపాలన దక్షుడని, ఓర్పు నేర్పుతో సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారని పేర్కొన్నారు. తననిబద్ధత కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా నియమించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తన ఆచరణతో యూనివర్సిటీ ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు.
అడ్మినిస్ట్రేషన్ పరంగా రోజువారి కార్యకలాపాలను నిర్వహించడానికి ఒక మార్గ నిర్దేశం చేశారని తెలిపారు. అదేవిధంగా వచ్చిన గెస్ట్లు మాట్లాడుతూ ప్రొఫెసర్ యాదగిరి నాణ్యమైన పరిశోధనలు జరిపి అనేక పుస్తకాలు అచ్చు వేయడం వల్ల రాయల్టీ పొందడం యూనివర్సిటీకి‌ గర్వంగా ఉందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ యాదగిరి పరిశోధక విద్యార్థులకు తమ పరిశోధనలకు సమయం కేటాయిస్తూ సమయపాలన, క్రమశిక్షణ, కష్టపడి తత్వం వంటి వాటిలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడని కొనియాడరు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి శ్రీనివాస్, డాక్టర్ ఎన్ శ్వేత, డాక్టర్ కే గంగాధర్, పూర్వ విద్యార్థులు డాక్టర్ కే రాము, డాక్టర్ ఎం సరిత, డాక్టర్ ఎన్ స్రవంతి, డాక్టర్ ఎన్ స్వప్న, డాక్టర్ విజయ్ పరిశోధక విద్యార్థులు మనోజ్, ఇంద్రజ, రాజేంద్రప్రసాద్, బాల్ రెడ్డి, గంగాధర్ పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.