
గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఖమ్మం పాడు లో వైద్యాధికారి మధుళిక పర్యవేక్షణలో శుక్రవారం వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో తరుణ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న 36 మంది పరీక్షించి అవసరం చికిత్స అందజేసారు. జ్వరం తో బాధపడుతున్న ఐదుగురిని గుర్తించి వారికి మలేరియా నిర్ధారణ ఆర్.డి టి పరీక్ష నిర్వహించారు.సాదారణ జ్వరం అని తేలడంతో చిరు వ్యాధులకు ఇచ్చే చికిత్స చేసారు. అనంతరం గ్రామంలో వీధి వీధికి, ఇంటింటికి తిరిగి ఫ్రైడే – డ్రై డే ప్రాధాన్యత వివరించడం తోపాటు నీటి నిల్వ పాత్రలను తొలగించారు.నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి దోమలు నివారణకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమములో హెచ్.వి దుర్గమ్మ, హెచ్.ఎస్ పి.కృష్ణయ్య, హెచ్.ఎ భాస్కర్, ఎ.ఎన్.ఎం అనిత, ఆశాలు పాల్గొన్నారు.