
డిచ్ పల్లి మండల కేంద్రంలోని నాగపూర్ గేట్ జాతీయ రహదారి 44 నుండి నగరంలోని రాజరజేంద్ర చౌరస్తా వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి కి మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలోఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి కార్యకర్తలు, నాయకులు ర్యాలీ లో చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పగంగా రెడ్డి, మండలాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.