నిషిత డిగ్రీ కళాశాల వద్ద జాతీయ పతాకంతో విద్యార్థులు

నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని నిషిత కళాశాల వద్ద జూన్ రెండో తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు జాతీయ పతాకంతో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిషిత కళాశాల కోఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఓం షేక్, ప్రిన్సిపాల్ స్వప్న, అధ్యాపక బృందంతోపాటు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love