బీజేపీ హటావో దేశ్ కి బచావో..

– క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం
–  కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల మహాధర్నా
– వందలాదిగా పాల్గొన్న ఉద్యోగులు కార్మికులు
నవతెలంగాణ -కంటేశ్వర్
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పోరేట్ అనుకూల కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మందబలంతో బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను పరిపాలనను కొనసాగిస్తున్నదని జాతీయ సహజ వనరులు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ విదేశీ కార్పోరేట్లకు అమ్మి వేస్తుందని డీజిల్ పెట్రోల్ వంటగ్యాస్ ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి సునీల్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ , ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్, ఐ ఎఫ్ టి యు వర్దయ్య లు అన్నారు బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు కేంద్ర కార్మిక సంఘాలు రెండు రోజుల దేశవ్యాప్త మహాధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండవ రోజు కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్మ నిర్వహించి నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ 4 లేబర్ కోడులను రద్దు చేయాలని రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కార్మికులను చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని ఆయన పిలుపునిచ్చారుకేంద్ర సర్కార్ ప్రభుత్వరంగ మౌలిక వసతులు, సహజ వనరులను కార్పొరేట్లు లూఠీ చేసే విధానపర నిర్ణయాలను అమలు ప చేస్తున్నది. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం వాటాలు తెగనమ్ముకున్నది. నేషనల్ మానిటైజేషన్ ప పైప్స్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ధారాదత్తం చేస్తున్నది. జాతీయ రహదారులు, రైళ్ళు, విద్యుత్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్, చమురు-సహజ వాయివు పైప్ లైన్లు, బొగ్గు గనులు, టెలికం టవర్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్.సి.ఐ గోడౌన్లు, క్రీడా మైదానాలతో సహా ప్రజా ఆస్తులను కార్పొరేట్లకు తెగనమ్ముతోంది. ఉద్యోగుల కష్టార్జితమైన పీఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అప్పజెప్తున్నది. మన రాష్ట్రంలో సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేసింది. హైదరాబాద్లో కేంద్రీకృతమై వున్న బిడిఎల్, బిఇఎల్, బిహెచ్ఐఎల్, హెచ్ఎల్, మిథాని లాంటి సంస్థలలో సుమారు 25 నుండి 50 శాతం దాకా వాటాలు అమ్మేసింది. కార్మికులు, మధ్యతరగతిలో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎసిలో లక్ష కోట్ల రూపాయల వాటాలు అమ్మేందుకు తెగబడింది. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వరంగ లి బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నది. ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్ధిక స్వావలంబనకే ముప్పు తెస్తున్నాయి.అనేక త్యాగాలు, రక్త తర్పణతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లు మారుస్తూ పార్లమెంట్ చట్టం- చేసింది. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తున్నది. సామాజిక భద్రతా కోడ్, వృత్తి సంబంధిత రక్షణ, ఆరోగ్యం- పని పరిస్థితుల కోడ్లతో పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నది. ప కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెరిగి దోపిడీకి హద్దే లేకుండా పోతుంది. కేంద్రకార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా ధర్నాకు వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శ సుధాకర్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ.ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్ రైతు సంఘం జిల్లా నాయకులు కంజర్ భూమయ్య లు మాట్లాడుతూ.. సుమారు 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు ఈ లేబర్ కోడ్ తో బానిసత్వంలోకి నెట్టబడతారు. ప్రభుత్వ స్కీంల్లోని కోటిమంది స్కీం వర్కర్లు ఉద్యోగ భద్రత, కనీస వేతనానికి నోచుకునే స్థితిలేదు. ఇండియన్ లేబర్ కాంగ్రెస్ (ఐఎల్సి) కార్మిక సంక్షేమం కోసం గతంలో చేసిన తీర్మానాలన్నీ చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. నిత్యవసరాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా కనీస వేతనం నెలకు రూ.26,000/-లు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ ఐ ఎఫ్ టి యు జిల్లా ముత్యన్న, ఐఎఫ్టియు భూమయ్య శివ ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు శివరాజ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ సిఐటియు జిల్లా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నర్సింగ్ రావు, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు కృష్ణ నరసయ్యతదితరులు పాల్గొన్నారు.

Spread the love