సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
స్క్రాప్ గోదాంలో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయం త్రం శివరాంపల్లి లోని ఒక స్క్రాప్ గోదాంలో చివరి భాగంలో సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించా యి. వెంటనే సి బ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అం దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోయి ఉంటే భారీ అగ్ని ప్రమాదంతో పాటు ఆస్తి నష్టం సంభవించేదని స్థానికులు వాపోతున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణమని అది ఎందుకు పేలిందో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కొన్ని పాత బైకులు, టైర్లు కాలిపోయాయని పోలీసులు చెప్పారు.